పుట:కాశీఖండము.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

శ్రీకాశీఖండము


పట్టణము లేడుఁ గీర్తిసంపద వహించు
మహితకైవల్యలక్ష్మికి మందిరములు.

87


వ.

అని నిశ్చయించి.

88


సీ.

సాకేతమున కేగి సరయూతరంగిణి
        నభిషేక మొనరించె నధికభక్తి
నల్పుఁ దెల్పును నైన నదులకూటము ప్రయా
        గాఖ్యంబునందు దేహంబు దోఁచె
గంగలో మణికర్ణికాతీర్థమునయందు
        సంకల్పపూర్వంబు గ్రుంకువెట్టె
కైవల్యకల్యాణఘంటాపధంబైన
        యానందవిపినంబు నాశ్రయించె


తే.

తీర్థదైవతకోటిఁ బ్రార్థించి పలికి
యఖిలమును నాచరించి తీర్థాంగకములఁ
దీర్థములయందు శ్రీమహాదేవుఁ గొలిచెఁ
బావనాచారనిరతుండు బ్రాహ్మణుండు.

89


సీ.

బ్రహ్మలోకోన్నతప్రాసాదనిశ్శ్రేణి
        యాజవంజవభీతి కభయపాణి
కలుషకంఠచ్ఛేదకాలాయస కృపాణి
        కైవల్యనవమౌక్తికమున కాణి
[1]వీరావనీస ముద్విష్టకంతర్వాణి
        చక్షురుత్సవగంధసారశోణి
చేతఃప్రసాదలక్ష్మీవిహారక్షోణి
        కల్పాంతకాలంబు గలపురాణి

  1. ఇందిరావణ సమాహితనిజాంతర్వేణి