104
శ్రీకాశీఖండము
తే. | చెలువయును దాను నాశీతబిలసహస్ర | 56 |
వ. | వెండియు నయ్యిల్వలమధనుండు యథావిధి మండూకకుండంబునం గ్రుంకె. పంచాక్షరీమంత్రసిద్ధుండు పంచధారాపల్లధార లనునిర్ఝరప్రవాహంబులఁ గృతావగాహుండయ్యె. పాటలజటాకిరీటుండు హాటకకూరశిరఃశృంగశృంగాటకఘాటంబునఁ గోటిలింగంబులం భజించె. లోపాముద్రాధిపతి యద్రికటకభద్రాసనంబున సమున్నిద్రప్రతాపముద్రావిద్రుతాక్షుద్రోపద్రవుం డగునుద్యానవీరభద్రు శ్రీద్రవహరిద్రాక్షతంబుల భద్రదారుద్రు పారిభద్రద్రుమక్షారకంబుల నారాధించె. బ్రహ్మర్షి బ్రహ్మపాదారవిందద్వంద్వంబు హరిచందనచర్చామచర్చికల నర్చించె. సిద్ధతాపసమూర్థాభిషిక్తుండు ఘంటాసిద్ధేశ్వరునివలన మంత్రసిద్ధి వడసె. మహాభాగుండు భోగవతీతీరంబున భోగేశ్వరు భోగాపవర్గప్రదు భుజంగభూషణు భజించె. నీవారముష్టింపచుం డిష్టకామేశ్వరునకుం బటిష్ఠనిష్ణావిశేషంబులం దుష్టిఁ గావించె. భువనగోప్తసప్తమాతృకలఁ దలంచె. నహుషదమనుండు ముషితసకలకలుషం బగుకదళీవనవిషమభువినిగమభషకపరిషదనుగతవృషభగమనుం గపటశబరభటు నటఁ (?) దుహితృపరివృఢు నశఠమతిం గొలిచె. అనంతరంబ యొక్కవివిక్తప్రదేశంబున సుఖాసీనుండై. | 57 |