ఆత్మసంయమ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (ఆత్మసంయమ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
అనాశ్రితః కర్మఫలం మార్చు
శ్రీకృష్ణ భగవానుడు పలికినది: - కర్మఫలంపైన ఆధారపడకుండా, చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతదే కర్మ సన్యాసీ, కానీ అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలేసినవాడు కాదు.
యం సన్యాసమితి మార్చు
అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.
ఆరురుక్షోర్మునేర్యోగం మార్చు
యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతూంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది.
యదా హి నేన్ద్రియార్థేషు మార్చు
ఎప్పుడైతే విషయ వస్తువులలోను, కర్మలలోనూ తగుల్కోకుండా సర్వ సంకల్పాలను వదిలి వేస్తాడో అప్పుడు యోగరూఢుడని పిలవబడతాడు.
ఉద్ధరేదాత్మనాత్మానం మార్చు
తన్ను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శతృవు.
బన్ధురాత్మాత్మనస్తస్య మార్చు
స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది.
జితాత్మనః ప్రశాన్తస్య మార్చు
మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో మానావమానాలలో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు.
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా మార్చు
జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందిన వాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, మట్టి, రాయి, బంగారాలని సమంగా చూసేవాడు ఐన యోగి యుక్తుడని పిలవబడతాడు.
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబన్ధుషు మార్చు
మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు.
యోగీ యుఞ్జీత మార్చు
ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః మార్చు
శుచియైన ప్రదేశంలో అట్టే ఎత్తుగానూకాక, మరీ కిందగానుకాక, దర్బాసనం మీద లేడి చర్మం, దానిమీద వస్త్రాన్ని పరచి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని
తత్రైకాగ్రం మనః మార్చు
ఆ ఆసనంపైన కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి, ఆత్మ శుద్ధికోసం యోగాన్ని అభ్యసించాలి.
సమం కాయశిరోగ్రీవం మార్చు
శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా నిటారుగా ఉంచి, దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ
ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః మార్చు
ప్రశాంతమైన మనస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, మనస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.
యుఞ్జన్నేవం సదాత్మానం మార్చు
మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.
నాత్యశ్నతస్తు యోగోऽస్తి మార్చు
అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు.ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి
యుక్తాహారవిహారస్య మార్చు
ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే వానికీ యోగం(జన మరణ)దుఃఖాన్ని హరిస్తుంది.
యదా వినియతం మార్చు
ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.
యథా దీపో నివాతస్థో మార్చు
ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.
యత్రోపరమతే చిత్తం మార్చు
యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడో,
సుఖమాత్యన్తికం యత్తద్ మార్చు
ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ అనుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో,
యం లబ్ధ్వా చాపరం మార్చు
దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా చలించడో,అతడె నిజమైన యోగి
తం విద్యాద్దుఃఖసంయోగవియోగం మార్చు
దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.
సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా మార్చు
సంకల్పవల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని వైపులనుండి నిగ్రహించాలి.
శనైః శనైరుపరమేద్బుద్ధ్యా మార్చు
ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని(బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి)శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.
యతో యతో నిశ్చరతి మార్చు
నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.
ప్రశాన్తమనసం హ్యేనం మార్చు
ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైయిన ఉత్తమ సుఖం లభిస్తుంది.
యుఞ్జన్నేవం సదాత్మానం మార్చు
ఇలా నిరంతరం ఆత్మాభ్యాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖాన్ని తేలికగా పొందుతాడు.
సర్వభూతస్థమాత్మానం మార్చు
యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
యో మాం పశ్యతి సర్వత్ర మార్చు
నన్ను అన్నిటిలోనూ, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.
సర్వభూతస్థితం యో మాం మార్చు
అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర మార్చు
అర్జునా దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.
యోऽయం యోగస్త్వయా మార్చు
అర్జునుడు ఇలా అడిగాడు; - కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.
చఞ్చలం హి మనః మార్చు
కృష్ణా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.
అసంశయం మహాబాహో మార్చు
శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: - సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారానూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.
అసంయతాత్మనా యోగో మార్చు
మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించ వచ్చును.
అయతిః శ్రద్ధయోపేతో మార్చు
అర్జునుడన్నాడు: - శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.
కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛి మార్చు
ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?
ఏతన్మే సంశయం కృష్ణ మార్చు
కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా చేదించ తగిన వాడివి నీవే. నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఎవరూ లేరు.
పార్థ నైవేహ నాముత్ర మార్చు
శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: - అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.
ప్రాప్య పుణ్యకృతాం మార్చు
యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట్లో జన్మిస్తాడు.
అథవా యోగినామేవ మార్చు
లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో ఇలాటి జన్మ చాలా అరుదైనది.
తత్ర తం బుద్ధిసంయోగం మార్చు
కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.
పూర్వాభ్యాసేన తేనైవ మార్చు
పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని దాటి పోతాడు.
ప్రయత్నాద్యతమానస్తు మార్చు
యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలన్నింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని(మోక్షం)చేరుకుంటాడు.
తపస్విభ్యోऽధికో యోగీ మార్చు
అర్జునా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ)యోగివి కా.
యోగినామపి సర్వేషాం మార్చు
యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |